కైకలూరు నియోజకవర్గంలో దూసుకుపోతున్న జనసేన

  • 11వ రోజు జనసేన క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీ

కైకలూరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా పండగలాగ మొదలైన జనసేన పార్టీ 11వ రోజు క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీలో భాగంగా కలిదిండి మండలం, గోపాలపురం గ్రామంలో కైకలూరు మండలం వడర్లపాడు, ఆటపాక గ్రామాల్లో కిట్లు జనసేనపార్టీ కృష్ణా జిల్లా కార్యదర్శి బి.వి.రావు, కృష్ణా జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, జనసేన పార్టీ కైకలూరు నియోజకవర్గ యువనాయకులు వలవల రవితేజ, కైకలూరు మండల ఉపాధ్యక్షులు శొంఠి రాజేశ్వరి, జనసైనికుడు కేసిరెడ్డి సాయికుమార్ మరికొంతమంది జనసైనికులు జనసేన నాయకుల పంపిణీ చేయడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం సీటు జనసేన పార్టీ లక్ష్యంగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు.