బసినేపల్లి తండాలో 20 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక

  • అన్ని కులాలు, మతాలు, వర్గాలు చూపు ఇప్పుడు జనసేన వైపు
  • పవన్ కళ్యాణ్ అద్భుతమైన పోరాట పటిమతో బలమైన రాజకీయ శక్తిగా అవతరించిన జనసేన పార్టీ
  • గుంతకల్ నియోజకవర్గం జనసేన – టిడిపి సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం: గుత్తి మండలం బసినేపల్లి తండాలో గుత్తి మండల, పట్టణ అధ్యక్షులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్ సీనియర్ నాయకులు బోయగడ్డ బ్రహ్మయ్య, నాగయ్య రాయల్, నిస్వార్థ జనసైనికుడు మురళి నాయక్ ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయ బాధ్యుడు వాసగిరి మణికంఠ గారి సమక్షంలో జనసేన పార్టీలో 20 కుటుంబాలు చేరాయి. వారందరికీ జనసేన నాయకులు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు, అనంతరం ఇంటింటికి వెళ్లి ఈసారి పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించండి అని నాయకులు గ్రామస్తులను కోరారు. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం, ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న అద్భుతమైన పోరాటపటిమను చూసి ఆకర్షితులై ముఖ్యంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, అధినేత ఆశయ సాధనకు మా వంతు బాధ్యతగా మేము సైతం అంటూ స్వచ్ఛందంగా బసినేపల్లి తాండ గ్రామస్తులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని. అందరం ఒక కుటుంబ సభ్యుల కలసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా జనసేన, టిడిపి ఉమ్మడి పార్టీల విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గుత్తి, గుంతకల్ జనసేన నాయకులు అఖండ భాష, జంగాల వెంకటేష్, రవికుమార్, ధనుంజయ, గాలి వెంకటేష్, గాజుల రాఘవేంద్ర, ఆటో రామకృష్ణ, కసాపురం నంద, కత్తులవీధి అంజి, సుబ్బయ్య, పామయ్య, అనిల్ కుమార్, మంజునాథ్ కాపు సంక్షేమసేన నాయకులు రాయల్ రంగ, హరీష్ రాయల్, వంశీ, విజయ్, మోహన్, విజయ్, రంజిత్ తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.