365 రోజులు కౌంట్ డౌన్ బోర్డు, నత్త నడకన నిర్మాణం

  • 365 రోజులు కౌంట్ డౌన్ బోర్డు ఒకటి పెట్టారు రెండు సంవత్సరాలు పైన కావస్తున్నా మినీ బైపాస్ బ్రిడ్జ్ నిర్మాణ జాప్యం జరుగుతూ నత్త నడకన సాగుతుంది
  • జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్

నెల్లూరు, ముత్తుకూరు జంక్షన్లో బ్రిడ్జి నిర్మాణంలో జరుగుతున్న జాప్యం ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజల ఉద్దేశించి జనసేన పార్టీ ఆందోళన కార్యక్రమం శుక్రవారం ఉదయం ముత్తుకూరు బ్రిడ్జి వద్ద జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ….

  • జగన్మోహన్ రెడ్డి ముద్దుల మీద ముద్దులు పెట్టి ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేసి గుద్దులు మీద గుద్దులు గుద్దుతున్నారు.
  • ప్రజల పొట్ట కొడుతున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే అవగాహన లేని ఈ వైసీపీ పరిపాలనతో ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు అసలు ఈ అవగాహన లేని పాలనలో మన రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పలేకపోతున్నాం.
  • పరిశ్రమలు రావట్లేదు ప్రజలకు ఇష్టం వచ్చినట్లు పన్నులు ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, ఆ పన్ను ఈ పన్ను అని వేస్తున్నారు.
  • వర్షాకాలంలో అప్పుడు వర్షం ఇళ్లలో నీరు చేరుతాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతాయి, ఎక్కడ చూసినా దోమలు, దీనివల్ల ఎక్కడ చూసినా విషజ్వరాలు వస్తున్నాయి.
  • అంటే అవగాహన లేని పరిపాలన ఎంత భయంకరంగా ఉందంటే.. ఉద్యోగస్తులు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వటం లేదు రైతులకు ఎక్కడ కూడా గిట్టుబాటు ధరలు లేవు ఉపాధి అవకాశాలు లేవు.
  • ఎక్కడా అభివృద్ధి లేదు, ఎవరికి బిల్స్ ఇవ్వడం లేదు రోడ్లు చూస్తే అధ్వాన్న పరిస్థితిలో ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి.
  • నేడు ముఖ్యంగా నెల్లూరు నగరంలో చూసుకున్నట్లయితే ముఖ్యమైన సెంటర్ ముత్తుకూరు గేట్ జంక్షన్ రామలింగాపురం మినీ బైపాస్ బ్రిడ్జ్ చూసుకున్నట్లయితే దాదాపు రెండు సంవత్సరాల నుంచి జాప్యం చేస్తూ నత్త నడకన సాగుతుంది.
  • కౌంట్ డౌన్ బోర్డు 365 రోజులు అంటూ ఒకటి పెట్టారు దాన్ని కూడా తీసేశారు అవగాహన లేని పరిపాలన వల్ల, ఈ ప్రజా ప్రతినిధులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వలన ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియకపోవడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
  • సిటీలో బ్రడ్జి కడుతున్నాం ఈ బ్రిడ్జికికి లేయర్లు వేయాలంటూ అవగాహన లేకుండా అన్ని దారులు మూసివేసి కనీసం డైవర్షన్స్ బోర్డ్స్ కూడా సరిగా పెట్టకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
  • ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు కానివ్వండి, నెల్లూరు నగరంలో ఉండేటటువంటి వాళ్లు కానివ్వండి ఎక్కడికెళ్లాలన్నా ఎట్నించాలన్నా దారి తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
  • పిల్లల్ని స్కూల్ కి తీసుకువెళ్లాలన్నా, ఉద్యోగస్తులు ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారాలు చూసుకోవడానికి వెళ్లాలన్నా, పెద్దవారు హాస్పిటల్ కి వెళ్ళాలి అన్నా, చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు.
  • ఎందుకంటే ఇది నెల్లూరులో ఒక మేజర్ జంక్షన్, నెల్లూరులో. ఇలాంటి జంక్షన్ వీరు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మూసివేయడం మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
  • మీరు అవగాహనతో అన్నీ సేఫ్టీ మెజర్స్ తీసుకొని రాత్రి వేళలో పని చేసుకుంటూ పగలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా సురక్షితంగా బ్రిడ్జి నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం .
  • దీనివల్ల ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది చాలా ఇబ్బందిపడుతున్నారు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఆటో కార్మికులు కానివ్వండి, టూ వీలర్స్ వెహికల్ లో వెళ్లే వాళ్ళు గాని, కారులో వెళ్లేవారు గాని, ఎటు వెళ్లాలి అనేది కూడా వాళ్లకి అర్థం కావట్లేదు.
  • ఈరోజు మనం ముత్తుకూరు నుంచి సిటీలోకి వెళ్లాలంటే మొత్తం హైవే నుంచి తిరుగుతూ వెళ్ళాలి. ఇస్కాన్ సిటీ దగ్గర తవ్వేసున్నారు, హరినాథపురం రోడ్డు అంతా గోతులున్నాయి, ఆ రోడ్లో రాలేకపోతున్నారు.
  • ఇప్పుడు బాలాజీ నగర్ నుంచి రావాలన్నా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అసలు ఎక్కడికి ఎవర్ని అడిగి వెళ్లాలనేది కూడా అర్థం కావట్లేదు.
  • కనీసం కామన్ సెన్స్ ఎక్కడైనా సిటీలో బ్రిడ్జి కట్టేటప్పుడు ఆపేటప్పుడు ప్రజలకు ముందుగానే అవగాహన కల్పిస్తారు ఈ రోడ్ల వల్ల ఎటు నుంచి వెళ్లాలనేది నోటీసు బోర్డు లాంటి వాటి ద్వారా తెలియజేస్తారు.
  • అవేమీ లేదు ఎక్కడ చూసినా ఒక్క డైవర్షన్ బోర్డు కూడా లేదు సరిగ్గా ఈ డైవర్షన్ లో ఈ రూట్ కి వెళ్ళాలా అని ఒక అవగాహన లేదు.
  • ఈ అవగాహన లేని పరిపాలన వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి.
  • నిజంగా ఈ వైసిపి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్లు అసలు ప్రజల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది.
  • ఎన్నో వాగ్దానాలు చేశారు ఎన్నో హామీలు ఇచ్చారు అవన్నీ గాలికి వదిలేసారు. ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు.
  • ప్రజలు నిజంగా ఎంతో బాధపడుతున్నారు ఎందుకు అనవసరంగా వీళ్ళకి ఓట్లు వేసాము అన్ని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు.
  • ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి ఎన్ని మాయ మాటలు చెప్పిన ఈసారి వైసీపీ ప్రభుత్వం నమ్మే సిచ్యుయేషన్ లో ప్రజలు కూడా లేరని వాళ్లే తెలియజేస్తున్నారు.
  • అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క సమస్యపై జనసేన పార్టీ బలంగా పోరాడుతుంది ఈ బ్రిడ్జి కూడా తొందరగా పూర్తి చేసి ప్రజలకు కూడా ఒక ఆల్టర్నేటివ్ తొందరగా చూపించాలని మేము కోరుకుంటున్నాం.
  • ఎందుకంటే ప్రజలు ఎంతో ఇబ్బందిపడుతున్నారు, ఈ బ్రిడ్జి నిర్మాణం అని చెప్పి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఏం నిర్మాణం జరగలేదు.
  • దీన్నిబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఈ అవగాహన లేని పాలన వల్ల ఎంత ఇబ్బందులు పడతామనేది, ప్రజలు కూడా తప్పకుండా ఆలోచించాలి అని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను అని తెలిపారు.
    ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ తో జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గునుకుల కిషోర్‌, జ‌న‌సేన ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు సుజ‌య్ బాబు, రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొట్టే వెంక‌టేశ్వ‌ర్లు, జిల్లా కార్య‌ద‌ర్శి ఆలియా, ప్రశాంత్ గౌడ్, ప‌ట్ట‌ణ క‌మిటీ స‌భ్యులు సుల్తాన్ బాషా త‌దిత‌రులు పాల్గొన్నారు.