గిరిజన గ్రామాల్లో లేని బస్సు టూరిస్టులకు ఎందుకు

ఆరకు, టూరిస్టు బస్సుకి గిరి గ్రామదర్శిని పేరు ఎందుకు? ఏమైనా గిరిజనులకు గిరిజన గ్రామాల్లో బస్సు వేశారా అంటూ జనసేనపార్టీ ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు ప్రశ్నించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో ఆధారపడుతున్న గిరిజనులు లోతేరు బస్కి గుంట సీమా సోవ్వ లాంటి ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గిరిజనులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించే నాధుడే లేడు టూరిజం ద్వారా కోట్లు రూపాయలు ఆదాయం వస్తున్న గిరిజన ప్రాంతాల్లో టూరిస్టులు తిరిగే ప్రాంతాల్లో రోడ్లు బాగుచేయరు టూరిజం వల్ల వచ్చే ఆదాయం పంచాయితీ అభివృద్ధికి టూరిజం ఏటా ఎంత ఇస్తుంది గిరిజన ప్రాంతాల్లో ఏటా కోట్ల రూపాయలు వస్తుంది టూరిజం పేరుతో రోజు ఎన్నో బస్సులు నడిపిస్తున్నారు. ఈ బస్సు గిరి గ్రామదర్శిని అంటూ టూరిస్టులు కోసం ప్రజాధనం ఎందుకు వృధా చేస్తున్నారు టూరిస్టులకు బస్సు పెట్టి అన్ని చూపిస్తున్నారు గిరిజన గ్రామాల్లో బస్సు సౌకర్యం ఎందుకు కల్పించట్లేదు టూరిస్టుల మీద ఉన్న ప్రేమ గిరిజనుల మీదా లేదా గిరిజనులు ప్రైవేటు వాహనాలే దిక్కు ముందు గిరిజన ప్రాంతాల్లో బస్సు సౌకర్యం కల్పించండి టూరిజంలో వచ్చే ఆదాయం పంచాయితీలకు ఖర్చుపెట్టండి. టూరిస్టుల కోసం బస్సులు, లాడ్జి హోటల్ లు కడితే వాళ్లకు మాత్రమే ఉపయోగం గిరిజన గ్రామాల్లో అభివృద్ధికి బస్సు సౌకర్యం కల్పించడానికి అధికారులు కృషి చేయాలి అంటూ మాదాల శ్రీరాములు డిమాండ్ చేసారు.