సర్వేపల్లిలో 3వ రోజు జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు

సర్వేపల్లి, గత మూడు రోజుల నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు రాష్ట్రంలో కోట్ల రూపాయల అవినీతి జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు జగనన్న మోసం అనేటువంటి కార్యక్రమాన్ని మూడవరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం లోని వెంకటాచలం మండలంలో ఉన్నటువంటి జగనన్న ప్లాట్ లని పరిశీలించడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల మండలంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన అధికార పార్టీ నాయకులు అనడానికి ఎన్నో నిదర్శనాలు మనం చూడొచ్చు అదేవిధంగా ఎర్రగుంట దగ్గర వేసిన ప్లాట్లు లక్షల్లో అమ్మకాలు జరిపినటువంటి పరిస్థితి అదే విధంగా సర్వేనెంబర్ 667/3 కనుపూరు బిట్-1 లో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూమిని పేదలకి అని చెప్పి 303 ప్లాట్ లని అక్కడ ఏసీ మిగిలినది చేతివాటం చేసుకునే విధంగా అక్కడ ప్లాట్లు వేయడం అదేవిధంగా ఈ భూమి కోర్టులో ఉండి రెవెన్యూ శాఖకి జిల్లా కలెక్టర్ గారికి కోర్టు నుంచి సమన్లు కూడా పంపించినారు మరి కోర్టులో పరిష్కారం కాకుండా ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలో పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ప్లాట్ లేసి ఇల్లుని నిర్మించడం ఎంతవరకు సమంజసం అంటే పేదలకు ఇచ్చే ఇళ్లు మీరు ప్రభుత్వ భూమిలో ఇవ్వచ్చు లేదంటే ప్రైవేట్ భూమ్మీనీ కొనుగోలు చేసి వాళ్ళకి శాశ్వతంగా ఇళ్ళు నిర్మించవచ్చు మరి ఎందుకని దేవాదాయ శాఖ భూమి మీద మీ కన్నుపడింది అంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని ముందు పేదలకు ఇచ్చి వెనక ఉన్న మిగిలిన భూమంతా కబ్జా చేయాలనేటువంటి ఆలోచనతో ఏమైనా ఉన్నారా ఇంత అవినీతి జరుగుతా ఉంటే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి మరి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడానికి గల కారణాలేంది అంటే వీటన్నిటిలో కూడా మరి మంత్రి గారికి ఏమైనా భాగస్వామ్యం ఉందా అని మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఇటువంటి అవినీతికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీహరి, సందీప్,తదితరులు పాల్గొన్నారు.