గృహనిర్మాణ పురోగతి అధికారిక లెక్కలను వివరించాలని జనసేన వినతి

శ్రీకాళహస్తి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శ్రీకాళహస్తి నియోజకవర్గ డి.ఈ శేషగిరిని కలిసి వినతి ఇచ్చిన నియోజకవర్గ జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు చేపట్టిన జగనన్న ఇళ్లు, పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమం నియోజకవర్గంలో నిర్వహించి జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో సోషల్ ఆడిట్ చేసిన అంశాలను డి.ఈకి వివరించి, అక్కడ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి, పేద ప్రజలు ఇళ్ళ నిర్మాణానికి పడుతున్న ఇబ్బందులు, నిర్మాణ క్వాలిటీ గురించిన విషయాలు వివరించడం జరిగింది. నియోజవర్గంలోని 4 మండలాల్లోని గృహనిర్మాణ పురోగతి అధికారిక లెక్కలను వివరించాలని కోరడం జరిగింది. నియోజకవర్గం మొత్తానికి దాదాపు 12,000 ఇళ్లు నిర్మాణం కొరకు మంజూరు చేస్తే 150 వరకు మాత్రమే ఇళ్లు నిర్మాణం 4 మండలాలలో మరియు శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో పూర్తి అయినట్లు, ఊరందూరు సమీపంలోని జగనన్న కాలనీలో 4,500 ఇళ్లకు 8 ఇళ్లు, రాజీవ్ నగర్ నవరత్నాల గుడి వద్ద ఉన్న కాలనీలో కేవలం 4 ఇళ్లు మాత్రమే పూర్తి అయినట్లు డి.ఈ తెలిపారు. ముఖ్య మంత్రి జూన్ కళ్ళ మొదట విడత పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించడం జరిగింది. తప్పకుండా దృష్టికి తీసుకుని వచ్చిన అన్ని అంశాలను పరిశీలించి క్షేత్ర స్థాయిలో జరిగే అవకతవకలకు సరిదిద్దుతామని తెలిపారు. వీలైనంత త్వరలో ప్రత్యేక అధికారులను ప్రతి కాలనీ దగ్గర నియమించి, పర్యవేక్షించి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని డి.ఈ తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు కొప్పాల గోపి, నాయకులు రవి కుమార్ రెడ్డి, మణికంఠ, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.