40, 41వ డివిజన్ కొత్తపేటలో సంకల్ప యాత్ర

ఏలూరు: ప్రస్తుతం వైసిపి నెలకొల్పుతోన్న విష రాజకీయ పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చి, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన చేయడం టిడిపి, జనసేన, బీజేపి కూటమితోనే సాధ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ప్రజల్లో భరోసా నింపారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజలెప్పుడో కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసేశారని పేర్కొన్నారు. ఏలూరులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు, మధ్యాహ్నపు బలరాం తో కలిసి ఆయన తనదైన శైలితో ముందుకు సాగుతున్నారు. రాజకీయాలలో ప్రజల వద్దకే పాలన అనే నినాదం తీసుకువచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని ఆ దిశగా పార్టీ ఆశయాలను, పార్టీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్తున్నారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి. నియోజకవర్గంలోని ప్రజలను వారి నివాసిత ప్రాంతాలకు వెళ్ళి కలవడంతో పాటూ వారిలో రాజకీయ చైతన్యాన్ని నింపుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో సంకల్పయాత్రలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారాయన. నివాసిత ప్రాంతాలను చాలా వరకు చుట్టేసిన బడేటి ఎక్కడెక్కడ ప్రజలు ఉంటారో వారి చెంతకు కూటమి అవలంబించనున్న విధానాలను తీసుకువెళ్తూ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు, బడేటి చంటి మాట్లాడుతూ 40,41 వ డివిజన్లోని కొత్తపేట లో ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుంది.. ప్రతి ఒక్క డోర్ కి వెళ్తున్నప్పుడు ప్రజల యొక్క ముఖాల్లో సంతోషం కనబడుతుందని, దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి.. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో సాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.. రాష్ట్రంలో భావితరాలకు భవిష్యత్తు కోసం మన ఓటు వేయాలని ప్రజలందరూ సంకల్పిస్తున్నారు..డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది.. మంచినీటి కొరత తీవ్రంగా ఉంది.. చిన్నచిన్న సాకులు చెప్పి సంక్షేమ పథకాలు పీకేసినట్టి పరిస్థితి నెలకొందని, ఎక్కడ కూడా హౌసింగ్ లోన్ ఇచ్చే పరిస్థితి లేదు.. ఎప్పుడు కూటమీ ప్రభుత్వం వస్తుందో, బడేటి చంటీ గారి సారధ్యంలో ఏలూరుని అభివృద్ధి పథంలో నడిపిస్తారని, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలందరూ కూడా ఈరోజు సంసిద్ధంగా ఉన్నారు. మే 13వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆరోజు అందరం కూడా ఉత్కంఠంతో ప్రతి ఒక్కరు కూడా రెండు ఓట్లు కూడా సైకిల్ కి వేసి అఖండ విజయాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి గారిని, పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ గారిని అఖండ విజయాలతో భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.. ఎందుకంటే వైయస్సార్ మేనిఫెస్టోలో అసలు ఏమీ లేదని, అదేవిధంగా కూటమి మేనిఫెస్టో చూసినప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమం అభివృద్ధి ప్రజలకు రెండు కల్లులాగా కనిపిస్తుందని, మంచి ప్రభుత్వం రావాలి అనేటువంటి ఆలోచన కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, మీడియా ఇంచార్జీ జనసేన రవి, కోలా శివ నాయకులు రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, నూకల సాయి ప్రసాద్, ఎమ్.డి.ప్రసాద్, కీర్తికృష్ణ నాయుడు,పూర్ణ,వంశీ, పవన్, వీరమహిళలు తుమ్మపాల ఉమా దుర్గ, కొసనం ప్రమీల, గాయత్రి, దుర్గా బీ.బీ తదితరులు పాల్గొన్నారు.