వైసీపీ పార్టీ నుంచి జనసేనలో 52 కుటుంబాల చేరిక

రంపచోడవరం, చింతూరు మండలం లచ్చిగూడెం పంచాయతీ కొత్తూరు గ్రామంలో ఉయిక వెంకటేష్ తీగల రవి కొవ్వాసి బాబురావు ఆధ్వర్యంలో వైసిపి పార్టీ నుండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి 52 కుటుంబాలు జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతూరు మండల పార్టీ అధ్యక్షులు మడివి రాజు పాల్గొని వారిని కండువా వేసి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అనంతరం మడివి రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిస్కారమే ధ్యేయంగా పార్టీ సిద్ధాంతాలు మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు చిలకం కన్నారావు సుబ్బారావు వీరమహిళ తీగల కవిత, నాగార్జున ఉయక నాగేశ్వరావు సంతోష్ కిరణ్ రంగయ్య లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.