జనసేన వనరక్షణలో 700 కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన 577వ రోజు జగ్గంపేట

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 577వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం శనివారం కిర్లంపూడి మండలం, రాజుపాలెం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 700 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 7500 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 578వ రోజు ఆదివారం గండేపల్లి మండలం, యల్లమిల్లి మరియు జగ్గంపేట మండలం, గుర్రప్పాలెం గ్రామాలలో జనసైనికుల ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కోరారు. శనివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి మండపాక శివ, రాజుపాలెం నుండి పోకల లోకేష్, మండపాక హరి, కిరణ్, వీరవరం నుండి పిడుగు జయబాబు, బస్వా బద్రి, మలిరెడ్డి విష్ణు, ఎస్.తిమ్మాపురం నుండి యెద్దు అర్జున్, పిల్లా శ్రీనివాస్, ఎన్. సతీష్, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, డేగల రాంబాబు, జానకి మంగరాజులకు మరియు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా యల్లమిల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన సత్తి శ్రీను కుటుంబ సభ్యులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.