గ్రేటర్ హైదరాబాద్ జనసేన ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

  • ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

తెలంగాణా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయన ఆరాధ్యదైవం అయినటువంటి ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి రాజకీయ విజయం కోసం, శత్రు వినాశనం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగు కోసం వారు చేస్తున్న ప్రతి పని దిగ్విజయం కావాలని దానికి ఆంజనేయుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలనీ, గడిచిన 9 సంవత్సరాలుగా ఫిల్మ్ చాంబర్లోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రతీ ఏటా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శనివారం కూడా తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో పూజాకార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి, పర్యవేక్షణ కమిటీ సభ్యులు సురేష్ రెడ్డి, ఎల్బినగర్ నియోజకవర్గ ఇంఛార్జి శ్రీమతి శిరీష పొన్నూరు మరియు నాయకులు ఆబిధ్, సంతోష్, వీరమహిళలు వెంకట లక్ష్మీ, పద్మజ, జనసైనికులు అక్షయ్ రెడ్డి, గౌతమ్, సత్యనారాయణ, నగేష్, వెంకటేష్ పాల్గొన్నారు.

  • కె.పి.హెచ్.బి టెంపుల్ స్టాప్ దగ్గర అన్నదాన కార్యక్రమం

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన నాయకులు మరియు వీర మహిళలతో ఘనంగా శనివారం 8 గంటల నుండి బైక్ ర్యాలీలతో మోతీ నగర్, మూసాపేట్, భరత్ నగర్, కూకట్పల్లి, జగద్గిరిగుట్ట పలు ప్రాంతాలలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించుకుంటూ, కేక్ కటింగ్ మరియు సేవా కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. చివరిగా కెపిహెచ్బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి వివిధ రంగాలకు చెందిన సుమారు 2 వేల మంది కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఇంచార్జ్ నందగిరి సతీష్, మండలి దయాకర్, కొల్లా శంకర్, తుమ్మల మోహన్ కుమార్, నాగేంద్ర వెంకటేశ్వరరావు, కిషోర్ నాగరాజు మహేష్ శ్యామ్, ఠాగూర్, వీర మహిళలు భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, జనసైనికులు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

  • మోతినగర్లో ఘనంగా జనసేనుని జన్మదిన వేడుకలు

జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మోతినగర్ జనసేన ఆధ్వర్యంలో శనివారం మోతినగర్ క్రాస్ రోడ్స్ లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. జన్మదిన వేడుకలలో భాగంగా కేక్ కటింగ్, జెండా ఆవిష్కరణ, బైక్ ర్యాలీ, పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ స్టేట్ ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు బడే విశ్వేశ్వరరావు, కుంపట్ల రాంబాబు, వలివేటి సురేష్, రాజేష్ సాహు, చైతన్య ప్రభు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.శ్రీనివాస్, మత్తి శ్రీనివాస్, వెంకట శ్రీధర్, నరసింహారావు పసుపులేటి లక్ష్మణ్, రాధాకృష్ణ, ఫణి రాజా పసుపులేటి ప్రసాద్, వెంకటేశ్వరరావు, డా.సత్యనారాయణ, లిఖిత, మహాలక్షి, పద్మజ, జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీరమహిళలు పాల్గొన్నారు.

  • కుత్బుల్లాపూర్లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జి నందగిరి సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉదయం కట్ట మైసమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేసి, సూరారం కాలనీ బస్ స్టాప్ లో, షాపూర్ చౌరస్తాలో జనసేన జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ పాల్గొని జగద్గిరిగుట్ట డివిజన్ లో పార్టీ జెండా ఎగరేసి కేక్ కట్ చేసి సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన ఎదుగుతుందని అందుకు నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీర మహిళలు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.

  • మునుగోడులో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన్నాని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండల పరిధిలోని రాంరెడ్డి పల్లి గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి గోకుల రవీందర్ రెడ్డి జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.