పురపాలక సమావేశంలో టిడిపి, జనసేన బాయ్ కాట్

అమలాపురం: అమలాపురం పురపాలకకౌన్సిల్ సాదారణ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. కౌన్సిల్ సమావేశం నుంచి టిడిపి, జనసేన కౌన్సిలర్లు బాయ్ కాట్ చేసారు. మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ కౌన్సిల్ సమావేశంలో పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. వైసీపీ కౌన్సిలర్లువీరికి పోటిగా నినాదాలుచేసారు. కొద్దిసేపు గందర గోళం ఏర్పడింది. అనంతరం కార్యాలయం బయట టీడీపీ, జనసేన నాయకులు నినాదాలు చేసారు.