జనసేన భీమ్ యాత్ర 16వ రోజు

కాకినాడ సిటి: జనసేన భీమ్ యాత్ర జనసేన పార్టీ 8వ డివిజన్ నందు ఎన్.సత్తిబాబు ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు స్థానిక ప్రజలతో కలిసి నేటి పరిస్థితులలో వారు ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చించారు. ప్రజలతో మాట్లాడుతూ ఏ దేశమన్నా, రాష్ట్రమన్నా సుభిక్షంగా ఉండాలంటే ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నారు. అలాంటిది ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుండీ ప్రజాస్వామ్యం అన్నది భూతద్దంలో పెట్టి వెతికినా కనపడే పరిస్థితులు లేవన్నారు. ఎటు చూసినా దళితులపై దౌర్జన్యాలు, అత్యాచారాలు వారి ఆస్థులపై ఆక్రమణలు నిత్యం చూస్తున్నామన్నారు. సాక్షాత్తు న్యాయాధికారిగా పనిచేస్తూన్న వ్యక్తిమీదే దౌర్జన్యం చేసి ఆయన ఉద్యోగాన్ని కూడా ఊడపెరకడం రాష్ట్రంలో దళితులకు తెలిసినదే అని గుర్తుచేసారు. ఎన్నికలు సమీపిస్తూండటంతో ముఖ్యమంత్రి ఇప్పుడు ఉద్యోగానియామకాలనే కొత్త నాటకానికి తెరలేపుతున్నాడనీ, దీంట్లో పైకి కనపడని ఎన్ని తిరకాసులు పెడతాడో దళితులు గమనించాలని దళిత ఓట్లతో అధికారాన్ని కైవశం చేసుకుని దళితులని అణచివేస్తున్న ఈ దళితద్రోహిని వచ్చే ఎన్నికలలో మట్టుబెట్టాలని పిలుపునిచ్చారు. మా ఈ భీం యాత్రకి స్థానిక పార్క్ వద్దకు వస్తున్నామని తెలుసుకున్న వై.సి.పి పార్టీ ఈ పార్క్ గేట్లకు అధికారులతో తాళాలు వేయించి యాత్రను ఆపాలని ప్రయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. తదుపరి స్థానిక అంబేద్కర్ గారి విగ్రహానికి దూరం నుండే నివాళులు అర్పించి అక్కడి మట్టిని కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షులు
అడబాల సత్యనారాయణ, సత్తిబాబు, రాజు, చిన్న, సూరిబాబు, బండి సుజాత, శిరీష, దీప్తి, ఉమా,స్టేట్ జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సుంకర సురేష్, ముత్యాల దుర్గాప్రసాద్, దారపు సతీష్, అగ్రహారం సతీష్ తదితరులు పాల్గొన్నారు.