రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడం ఎంతవరకు సబబు?

పాడేరు: క్రైమ్ స్టార్ క్రిమినల్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంపదతో ఏర్పాటు చేసిన అధికారిక వేదికపై రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని విమర్శించడం ఎంతవరకు సబబు? ఆని జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా జాయింట్ సెక్రటరీ కిల్లో రాజన్ కిల్లో రాజన్ ప్రశ్నించారు. ఆదివారం రాజన్ మీడియాతో మాట్లాడుతూ తాడేపల్లిలో మీరు ఇల్లు కట్టుకునే దాకా మీరు ఉన్నది హైదరాబాదులో కాదా? అప్పుడు మీరు లోకలా? నాన్ లోకలా? గురిగింజ తన నలుపు ఎరగదు అన్నట్టుంది మీ కథ. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గర్వంగా చెప్పగలడు నేను “యాక్టర్ నే” అని తను కేవలం సినిమాల్లో మాత్రమే యాక్టింగ్ చేస్తాడు. తను యాక్టింగ్ చేసి సంపాదించిన సంపదను దేశ విపత్తుల సమయంలో ఇచ్చి ఆదుకున్న మహోన్నతమైన వ్యక్తి, వైసిపి ప్రభుత్వం ఆదుకోలేని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు యాక్టింగ్ చేసి సంపాదించిన సంపదను పంచి ఆదుకుంటున్న గొప్ప నాయకుడు.
జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజజీవితంలో యాక్టింగ్ చేస్తున్నది నిజము కాదా? మీ “యాక్టింగ్ ఎలా ఉంటుందంటే” కోడి కత్తి డ్రామా కేసులో మరియు కీర్తిశేషులు వివేకానంద రెడ్డి గారి ఘోరమైన హత్య కేసులో మీరు మీ కుటుంబ సభ్యులు చేస్తున్న యాక్టింగ్ కు ఆస్కార్ అవార్డు ఇచ్చినా సరిపోదు”. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలోనే మంగళగిరి సభా వేదికగా ప్యాకేజీ స్టార్ అంటే నేను దేనితో కొడతానో అని స్పష్టంగా చూపించి చెప్పారు. మీరు ఇప్పటికైనా మీ సైకో భావజాలాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరే ఒక మారు ఊహించుకోండి?. తెలంగాణలో 2014 ఎన్నికలలో వైసిపి పార్టీ 52 పోటీ చేసిన అన్ని స్థానాల్లో నీ పార్టీ నాయకులు కంటే బర్రెలక్కకు వచ్చిన ఓట్లు ఎక్కువే కదా?. మీ పార్టీ అభ్యర్థులందరి ఓట్లు కలిపితే నోటా ఓట్లు ఎక్కువ కదా?. అప్పుడే మర్చిపోయావా? వైసిపి పార్టీని తెలంగాణలో బర్రెలక్కతో పోలుద్దామా? మీ చెల్లెలు పార్టీ కంటే… ఎన్నికలలో పోటీ చేసిన బర్రెలక్క దమ్మున్న నాయకురాలు కదా?. 2024 ఎన్నికల్లో… వైసిపి పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేసే 175 నియోజకవర్గాల్లో బర్రెలక్క కంటే ఓట్లు ఎక్కువ రావని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఇది నిజం కాదా?. వైసిపి పార్టీని రక్షించుకోలేక అయోమయ పరిస్థితుల్లో దిక్కు తెలియని దీనస్థితిలో ప్రతిపక్ష నాయకుల పైన నిందారోపణలు చేసి పబ్బం గడపాలని చూస్తున్నావ్ అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. జైల్ రెడ్డి గారు మీ ప్రవర్తనలో మార్పు రాకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు తస్మాత్ జాగ్రత్త అని కిల్లో రాజన్ హెచ్చరించారు.