శ్రీరామ్ నగర్ లో ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన బడేటి చంటి

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రజలంతా తీవ్ర అవస్థలు పడుతున్నారని బడేటి చంటి విమర్శించారు. శనివారం శ్రీరామ్ నగర్ లో ప్రజా సంకల్ప యాత్రలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బడేటి చంటి పాల్గొని ప్రతి ఇంటింటికీ తిరిగి కరపత్రాలు అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందన్నారు.. రానున్న రోజుల్లో ఏలూరులో ఎన్డీయే కూటమి గెలవడం ఖాయమని తెలియజేశారు.. రాష్ట్ర సహకారం కోసం బిజెపితో పొత్తు పెట్టుకున్నామన్నామని, తప్పనిసరిగా కూటమిని గెలిపించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు.. మా అన్నయ్య స్వర్గీయ బడేటి బుజ్జి గారి హయాంలో కూడా వారు శనివారపు పేటను పలు విధాలుగా అభివృద్ధి చేశారన్నారు.. రానున్న రోజుల్లో నేను కూడా ఇదేవిధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.. ఇదే ఏరియాలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని బడేటి చంటి మండిపడ్డారు.. రానున్న రోజుల్లో శనివారపు పేటను మరింత సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడుతో చెయ్యి కలిపి సమాజ స్థాపన కోసం యువత భవిష్యత్తు కోసం ఈ కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించే బాధ్యతను భుజాన ఎత్తుకోవాలని పిలుపునిచ్చారు.. రేపు రాబోయే రోజుల్లో వైసిపి ప్రభుత్వానికి కచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని అన్నారు.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు..ఈ సంకల్ప యాత్రలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీల నాయకులతోపాటు ఏలూరు జనసేన నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, రాష్ట్ర చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కావూరి వాణిశ్రీ, నాయకులు ఎట్రించి ధర్మేంద్ర, సరిది రాజేష్, బొత్స మధు, అల్లు సాయి చరణ్, జనసేన రవి, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, ఎమ్.డి.ప్రసాద్, నూకల సాయి,కూనిశెట్టి మురళి, మేకా సాయి, అరవింద్, శ్రీరామ్, సోంబాబు, వాసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.