అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

తుని నియోజకవర్గం: కోటనందూరు మండలం, పాతకొట్టాం పంచాయతీ, కే ఎస్ కొత్తూరు గ్రామంలో కొరుప్రోలు జానకమ్మ, బాబ్జి దంపతుల తాటాకిల్లు షార్ట్ సర్క్యూట్ సంభవించి ఏప్రిల్ 5 శుక్రవారం అగ్ని ప్రమాదానికి గురై వారి తాటాకిల్లు దగ్ధమైంది. వారికి తక్షణ సహాయం కింద జనసేన పార్టీ తరపు నుంచి వారికి సహాయం అందించాలని ఒక సహృదయంతో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరియు మా జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటూ.. వారికి తక్షణ సహాయం కింద కోటనందూరు మండల వైస్ ప్రెసిడెంట్ అల్లు లవరాజు గారి ఆధ్వర్యంలో, కోటనందూరు మండల ప్రెసిడెంట్ పెదపాత్రుని శ్రీనివాస్ గారు అధ్యక్షతన, తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు, కోటనందూరు మండల వైస్ ప్రెసిడెంట్ నక్క రామకృష్ణ గారు, మండల సంయుక్త కార్యదర్శి, లగుడు నాగేశ్వరరావు గారు, చిటెకెల అప్పలనాయుడు గారి సతీమణి, సత్యవేణి, పాత కొట్టం జనసేన నాయకులు అడపా వీర కృష్ణ, కే.ఎస్ కొత్తూరు గ్రామ ఉపాధ్యక్షులు గాడి నాగేశ్వరరావు, యడ్ల శ్రీను, గాడి కృష్ణ, గాడి రాజేంద్ర, లగుడు మణికంఠ వారి సమక్షంలో 21500 నగదు మరియు 50 కేజీలు రైసు ఆందించారు.