పల్లెటూరి సాంస్కృతి సంప్రదాయాలు కాపాడడమే జనసేన లక్ష్యం: గాదె మరియు బోనబోయిన

*సంప్రదాయాలు, సాంస్కృతులు కాపాడడం జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటని, పల్లెటూరి సంప్రదాయాలు ఎప్పుడు మర్చిపోవద్దని గాదె అన్నారు.

సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, అంచులవారిపాలెం గ్రామంలో అమరలింగేశ్వర స్వామి తిరునాళ్ళ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మండల అధ్యక్షుడు తోట నర్సయ్య నాయకులకి ఘనస్వాగతం పలికారు… స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం తోట నర్సయ్య ఆధ్వర్యంలో జనసేన నాయకులు ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభ సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన తవిటి బావన్నారాయణ ను రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు ఘనంగా సన్మానించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన పోయిఇందని, మంచి రోజులు రావాలంటే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని, చీకట్లను తరిమి వెలుగులు నింపే శక్తి ఒక్క జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు ప్రసాదు, కార్యదర్శి అంబటి మల్లి, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ, నాదెండ్ల నాగేశ్వరరావు, సిరిగిరి పవన్, రమేష్, మందపాటి దుర్గారావు, శిరిగిరి మణికంఠ, బస్వలా బాబు, మండల కమిటీ నాయకులు, వీర మహిళలు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.