ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మనుబోలులో జనసేన ర్యాలీ

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో పెరిగిన కరెంట్ చార్జీలని తగ్గించాలని ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ మనుబోలు మండలంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరెంట్ చార్జీల బాదుడు ఆర్టిసి బస్సు ఛార్జీల బాదుడు మున్సిపల్ చెత్త పన్ను పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిత్యవసర ధరల పెంపు ఉచితంగా 200 యూనిట్లు పేదలకి ఇస్తామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 300 యూనిట్లు కరెంటు బిల్లు అయితే అమ్మఒడిని తొలగిస్తామని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఏదేమైనా ఈ రాష్ట్రప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్య తరగతి కుటుంబ జీవన విధానం ఎంతో కష్ట సాధ్యం అనే విధంగా ఈ రాష్ట్ర పరిపాలనను కొనసాగిస్తున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక ఇంకొక మాట ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని ఏదైతే పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలి, అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలి, పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి, సామాన్య పేదలకు నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పరిపాలన కొనసాగించాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు మండల అధ్యక్షులు ప్రసాద్, సందీప్, పవన్, జాకీర్, రహమాన్ భాయ్, కె.శ్రీనివాసరావు, వెంకయ్య, కె.సుధాకర్, రాకేష్, శ్రీహరి, కార్తీక్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.