పవన్ కోసం పాదయాత్ర

  • పవన్ కోసం పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
  • జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, పిఠాపురం పట్టణంలో గల రైస్ మిల్ అసోసియేషన్ కళ్యాణ మండపం నందు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత జనసేన నాయకులు డాక్టర్ పిల్లా దీపికా శ్రీధర్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కోసం పాదయాత్ర అనే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ పవన్ రావాలి పిఠాపురం మారాలి పిఠాపురం నియోజవర్గ సమస్యలు పరిష్కారానికై మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించబోయే బస్సు యాత్ర విజయవంతమై రాబోయే ఎన్నికలు జనసేన పార్టీ విజయం సాధించాలని పిఠాపురం మండలంలోని తమ స్వగ్రామమైన కందరాడ గ్రామం నుండి ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వరకు పిఠాపురం నియోజకవర్గ జనసైన పార్టీ నాయకులు, విష్ణు హాస్పిటల్ అధినేత పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో జనసేవకులు, వీర మహిళలుతో కలిసి పవన్ కోసం పాదయాత్ర 18వ తేదీన ప్రారంభమవుతుందని నియోజకవర్గ ప్రజలు, జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆయన అందరినీ కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పవన్ కోసం పాదయాత్ర పోస్టర్, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, మీడియా మిత్రుల సమక్షంలో పోస్టర్ను డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తెలియచేసి పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని కార్యక్రమాలు చేపడతామని వచ్చే ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీని ఉన్నతంగా నిలబెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయగోదావరి జిల్లాల అధికార ప్రతినిధి తోలేటి శిరీష, సీనియర్ మహిళా నాయకురాలు పిల్లా రమ్య జ్యోతి, బీజేపీ పిఠాపురం మండల అధ్యక్షులు ముత్యాలరావు, విరవాడ జనసేన ఎంపీటీసీ అభ్యర్థి సూరిబాబు, జనసేవకులు గంజి గోవిందరాజు, పల్లెల వీరేంద్ర, గట్టెం భీమా నాయుడు మొదలగు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.