మానవత్వం చాటుకున్న జనసైనికుడు ..

అమలాపురం: జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు పిలుపు మేరకు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని చెప్పగానే తన వంతు సాయంగా కొండేపూడి వెంకటేష్ ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వెంకటేష్ కి పేషెంట్ కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రంశెట్టి సతీష్ తాడికొండ దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.