ఘనంగా పంతం నామినేషన్

  • వేలాదిగా తరలి వచ్చిన ప్రజల ఆదరణ, నామినేషన్ రోజే విశేష స్పందన
  • కూటమి ప్రభుత్వమే అధికారం చేపట్టనుందని ధీమా
  • అధికార పార్టీ వారు దొంగ నోట్లు పంచి ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నం

కాకినాడ రూరల్, జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) నామినేషన్ కార్యక్రమానికి శుక్రవారం విశేషంగా తరలివచ్చిన తన అభిమానులకు జనసైనికులకు తెలుగుదేశం, బిజెపి, నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఇంత ఆభిమానం చూపిస్తు నా గెలుపుకు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు అహర్నిశలు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. తాను గెలిచిన వెంటనే గత ఐదు సంవత్సరాలుగా వెనుకబడిన కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని సీనియర్ టిడిపి నాయకులు పిల్లి సత్యనారాయణ మూర్తి దంపతుల తో కలిసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడతానని అన్నారు, అలాగే పేద మద్య తరగతి వారికి ప్రభుత్వం తరపున రావలసిన అన్ని పదకాలను అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్ల వైసిపి పాలనతో ప్రజలు విసుగు చెందారని, అక్కడ జగన్ నీ, ఇక్కడ కన్నబాబుని గద్దె దించాలని ప్రజలు స్వచ్ఛందంగా జనసేన పార్టీ లోనికి చేరుతున్నారన్నారు. పెద్ద ఎత్తున మహిళలు చేరడం శుభ సూచకం అని అన్నారు. వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో కనీస మౌలిక సదుపాయాల్ని కల్పించడంలో విఫలమైందని. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తామన్నారు. వైద్యం పరంగా కాకినాడ జిజిహెచ్ వద్ద ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజలకు చికిత్సలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు ఈ ఐదేళ్లలో ఉత్సవ విగ్రహాల ఉన్నారే తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఎలక్షన్ కు ముందు రోజు ఓటర్లను మభ్య పెట్టేందుకే దొంగ పట్టాలను పంపిణీ చేయనున్నారని కాకినాడ సిటీలో పెద్ద దొంగ, రూరల్ లో చిన్న దొంగ దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటికే కాకినాడ రూరల్ లో దొంగ నోట్ల వ్యాన్ తిరుగుతున్నట్లు తమకు అనుమానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోకో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబి, సినీ నటుడు పృథ్వీరాజ్, టిడిపి రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి ఏసుదాసు, బిజెపి జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు రామస్వామి, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వర రావు, సీతయ్య దొర, రాష్ట్ర, జిల్లా మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.