కావ్య కృష్ణారెడ్డి నామినేషన్లో పాల్గొన్న అళహరి సుధాకర్

కావలి నియోజకవర్గం నుంచి జనసేన-టిడిపి-బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కావలి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసంలో జనసేన, టిడిపి, బీజేపీ పార్టీల నాయకులతో మీటింగ్ ఏర్పాటుచేసి అక్కడి నుండి బయలుదేరి ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అధికారి ఆర్డీవో సీనా నాయక్ కు మధ్యాహ్నం ఉమ్మడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి మరియు ఆయన కుమార్తె సంహితా నామినేషన్ లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆర్డీవో కార్యాలయం ముందర విలేకరుల సమావేశంలో కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ తో గెలిపించి ఆదరించాలని కోరారు. అదే విధంగా నెల్లూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కృష్ణారెడ్డి వెంట జనసేన ఇంచార్జి అళహరి సుధాకర్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్, మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు భరత్ కుమార్ యాదవ్, పాల్గొన్నారు. వెంకటేశ్వర రావు, సీతయ్య దొర, రాష్ట్ర, జిల్లా మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.