గ్రామాల నుంచే రాజకీయాల్లో సమూల మార్పు

చెట్లకు వేళ్లు ఎలాగో దేశానికి పంచాయతీలు అలాంటివని, మొదళ్లు నుంచి మందు వేస్తే తప్ప దేశ రాజకీయ వ్యవస్థ బాగుపడదని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. గ్రామ పంచాయతీలు అనేవి స్వతంత్ర సంస్థలు, ఎక్కడో కూర్చొని శాసించాలని చూసే ముఖ్యమంత్రులు, మంత్రుల వల్లే గ్రామాలకు నిధులున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందిపోతాయనేది జనసేనాని అభిప్రాయం. గ్రామాల నుంచి విప్లవం వస్తేనే రాజకీయాల్లో మార్పు వస్తుంది. సదాశయంతో, సిద్ధాంత బలంతో రాజకీయాల్లోకి వచ్చిన జనసేన,ఈ క్రమంలో ఒడిదుడుకులు ఉంటాయని తెలిసే 25 ఏళ్ల ప్రయాణం అని జనసేనాని వ్యాఖ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన ఎలా నెగ్గుకు
వస్తుంది? వేల కోట్లు ఉన్న వ్యక్తుల ముందు మీరు నిలబడగలరా? అని చాలా మంది ఎద్దేవా చేస్తారు…. ఆశయాల కోసం బలంగా నిలబడే యువత, ఆడపడుచులు ప్రతి గ్రామంలో ఉంటారు, వారిని నడిపించే వ్యక్తి ఒకరు కావాలి. నిలబడితే వాళ్లంతా నిలబడతారనే గాఢమైన నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చిన జనసేనాని …పల్లెల్లో
నుంచే రాజకీయ వ్యవస్థ బాగుపడాలి అనేది శ్రీ పవన్ కళ్యాణ బలమైన విశ్వాసం.

గ్రామాల్లో యువత, ఆలోచించే వ్యక్తులు చాలా మంది ఉంటారు. పంచాయతీకి నిధులు వస్తే సవ్యంగా ఖర్చు చేశారా? లేదా? దేనికి ఎంత ఖర్చు చేశారో కచ్చితంగా చెప్పి తీరాలి. అక్కడ ఏకగ్రీవాలు ఉండవు. అందుకని పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేసి మార్పు అక్కడ నుంచి మొదలవ్వాలి. బెదిరింపులు ఎదురవుతున్న కూడా గెలిచిన జనసేన గ్రామ నాయకులు ఎవరు ఎలాంటి ఒత్తిళ్లకు గురిచేసినా, ఆందోళన చెందకుండా… అభివృద్ధి మాత్రమే మా మొదటి సిద్దాంతం గ్రామ జనసేన నాయకులు ముందుకు పోతుంటారు. పంచాయతీలకు నేరుగా కేంద్రం నుంచి నిధులు వస్తాయి. వాటికి రాష్ట్రంలోని అధికార పక్షం ఏవైనా ఇబ్బందులు కలిగిస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని గెలిచిన సర్పంచులు , జనసైనికులు జనసేన సిద్ధాంతాలను బలంగా గ్రామంలో తీసుకు వెళ్తే గ్రామ రాజకీయాల నుంచే బలమైన
మార్పు మొదలవుతుంది.

మార్పు కోసం ఓ అడుగు ముందుకు వేసిన జనసేనాని…. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు, ఉప సర్పంచులుగా గెలిచి, గ్రామ రాజకీయాల్లో సమూల మార్పు కోసం మరో అడుగు వేశారు. ప్రభుత్వ దమనకాండను నామినేషన్ల పర్వం నుంచి నిర్విఘ్నంగా దాటుకొని విజయ తీరాలకు చేరిన ధైర్యం, సంకల్పం తో జనసేన సర్పంచ్ లు గ్రామంలో అభివృద్ధి చేసి ప్రజల మన్నలను అందుకుంటున్నారు. జనసేన పార్టీ మద్దతుతో కోరుకొల్లులో నిండు గర్భిణీ శ్రీమతి లీలా కనకదుర్గ గారు పోటీ చేసి గెలుపొందటం జాతీయ స్థాయిని ఆకర్షించింది. ఇళ్ల పట్టాలు ఆపేస్తామని అధికార పక్షం బెదిరిస్తే తన పొలంలో సగం ఇళ్ల పట్టాలకు ఇచ్చేస్తాను అని ప్రజలకు భరోసా ఇచ్చిన శ్రీ రంగా గారు ప్రజల విశ్వాసం పొందారు. ఓటర్లను వివిధ రీతుల్లో మభ్యపెట్టాలని చూసిన పాలకుల దుశ్చర్యలకు దీటుగా బదులిచ్చిన తీరు ఎన్నదగినది. పార్టీబలోపేతానికి గ్రామ స్థాయి నుండి పునాది వేయాలి. గ్రామ స్థాయి సమస్యలను ఆకళింపు చేసుకొని సామాన్యులకు అండగా నిలబడాలి. సరైన ప్రణాళికతో, గ్రామ పెద్దల సహకారంతో ఉపాధి హామీ వంటి పనుల ద్వారా గ్రామాభివృద్ధికి ఇతోధికంగా శ్రమించాలి. భవిష్యత్తులో జడ్.పి.టి.సి., ఎంపీటీసీ ఎన్నికల్లో, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో, క్రియాశీలక సభ్యత్వ నమోదులో తమ వంతు పాత్ర పోషించి పార్టీ పటిష్టతకు పాటు పడాలి.

రాష్ట్రంలో మార్పు మొదలైంది అనేది ఈ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన విజయాల ద్వారా వెల్లడవుతోంది. “డబ్బులు, మద్యం పంచకుండా గత పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ లు గెలిచారు. గ్రామ స్థాయి నుంచి పాలనాపరమైన మార్పులు వస్తేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. గ్రామ స్థాయిలో మహిళలు రాజకీయాల్లో రావాలంటే ఆలోచిస్తారు…కానీ జనసేన ప్రస్థానం మొదలయ్యాక గ్రామ రాజకీయాల్లో సైతం మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.