జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన గురివిగారి వాసు

రాజంపేట: ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు లో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. గత సంవత్సరం అన్నమయ్య డ్యామ్ వరదల్లో తోగురుపేట, మందపల్లి, పుల్లపతూరు, గుండ్లూరు ప్రాంతాలే కాకుండా నందలూరు మండలం పాటూరు, ఏర్రిపాపల్లి, నీలిపల్లి, గొల్లపల్లి, నందలూరు యస్సీ కాలనీ, నదిమాయపల్లి నడిగెడ్డ ఇంకా ఏటి పరివాహక ప్రాంతాలు చాలానే నష్టపోయాయి. అలాగే పాటూరులో ఎంత నష్టం జరిగిందో తెలుసు అందరికీ తెలుసు అక్కడ ఒక బీసీ కాలనీలో మహిళ వరద ధాటికి కొట్టుకుపోయి ఒక చెట్టుని పట్టుకొని బ్రతికింది. కొన్ని ఇల్లులు చాలా వరకు దెబ్బ తిన్నాయి పంట నష్టం ఏర్పడింది కానీ ప్రభుత్వం,అధికారులు అన్ని విధాల అందరికీ నష్ట పరిహారం అందించలేదు. ఇచ్చిన పరిహారం కూడా దేనికి సరిపోని పరిస్థితి. ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ కి వివరించడం జరిగింది. త్వరలో వరద ప్రభావిత ప్రాంతాలు ఆయనే స్వయంగా పర్యటించి ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారాలు బాధితులకు ఎంత వరకు అందాయో తెలుసు కొని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను అన్నారు.