చింతూరులో జనసేన సీనియర్ నాయకుల ఆత్మీయ సమావేశం

రంపచోడవం నియోజకవర్గం, చింతూరు మండల అధ్యక్షుడు మడివి రాజు ఆధ్వర్యంలో విలీన మండలాలో చింతూరులో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆత్మీయ సమావేశం జరిగింది. పార్టీ విధి విధానాలు పార్టీ సిద్దాంతాలు ఎలక్షన్లు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలో జరుగుతున్న అవక తవకలు కోసం అలానే టీడీపీ నాయకులతో కలిసి మనం నడవ వలసిన విధానాలు కోసం చర్చికోవటం జరిగింది. మన నియోజకవర్గంలో అధికార వైసీపీని గద్దె దించటానికి మనం ఎలా కృషి చెయ్యాలి నియోజకవర్గంలో ప్రధాన సమస్య పోలవరం ముంపు మండలాల్లో జరుగుతున్న అన్యాయం కోసం ఎటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. ఇరు పార్టీ అధినేతలు ముంపు సమస్యలను తీసుకెళ్ళి తగిన న్యాయం చెయ్యటానికి అలానే 2013 భూసేకరణ అమలు చేసి ప్రతిఒక్క నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా కార్యాచరణ చెయ్యాలని దిశా నిర్దిశా చెయ్యాలని చర్చించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంటరీ ఎడవల్లి భాస్కర్ రావు పాల్గొనగా లోకేష్ యువగలం కార్యక్రమం వలన ముఖ్య నాయకులు అందుబాటులో లేనివారిని ఫొన్ కాల్ ద్వారా మాట్లాడిన్చటం జరిగింది. అలానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి, దేవిపట్నం మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు, జిల్లా సంయుక్త కార్యదర్శి నర్సి యార్రయ్య, సీనియర్ నాయకులు రాగాల సురేష్, కూనవరం మండల అధ్యక్షులు నరేంద్ర కూనవరం టేకులబోరు పంచాయితీ ప్రెసిడెంట్ హేమంత్, కూనవరం జనసైనికులు, వి ఆర్ పురం సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, ఎటపాక మండలం సీనియర్ నాయకులు మోలా సతీష్ చింతూరు మండల జనసైనికులు మొదలైన వారు పాల్గొన్నారు.