ఆంధ్ర యూనివర్సిటీతో ఎం.ఓ.యూ కుదుర్చుకొన్న ఆప్ సబ్ కి ఆవాజ్

వైజాగ్: ఎన్.జి.ఓ ఆప్ సబ్ కి ఆవాజ్ దేశానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో రిజిస్టర్ నెంబర్ #956 డిసెంబర్ 2022న స్థాపించబడింది. వారి ప్రధాన లక్ష్యం నిధుల సేకరణ మరియు డబ్బు విరాళాలకు దూరంగా ఉండడమే. ఈ స్సంస్థ జ్ఞానాన్ని పంచుకోవడం మరియు అవసరమైన వారికి విద్యను అందించడం నమ్ముతుంది. ఆంధ్రా నలుమూలల నుండి ప్రత్యేకమైన దృష్టితో దివ్యాంగులు జీవితాలను ఉద్ధరించడం వారి ప్రధాన లక్ష్యం. వారిని స్వావలంబంతో పాటు గౌరవంగా జీవించేలా చేయడం మరియు ప్రజల్లో వారికంటూ ప్రత్యేక స్థాయి కల్పించడం ప్రజల నుండి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం వంటివి వారి ధ్యేయం. సమాజంలో మార్పు రావాలి అంటే యువ విద్యార్థుల ద్వారానే సాధ్యం అవుతుంది అలానే విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే విధంగా సెమినార్లు, వర్క్ షాప్ లు వంటివి ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో మన విద్యార్థులే మన విశాఖ పారిశ్రామికవేత్తలుగా మరొక లక్ష మందికి ఉద్యోగం కల్పించే అవకాశం మన విశాఖపట్నం నుంచి లభించే విధంగా ఆంధ్ర యూనివర్సిటీ తో ఆప్ సబ్ కి అవాజ్ ఎం.ఓ.యూ కుదుర్చుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన విద్యార్థులే మన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని వరి వంతు మేము సైతంగా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే వారి అంతిమ ధ్యేయం అలానే సమాజం పట్ల ఈ ప్రయత్నంలో భాగంగా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ మరియు ప్రధాన మద్దతుదారు ఓ ఎస్ డి డాక్టర్ కృష్ణ మోహన్ ముందుకు వచ్చి వారితో (అధ్యక్షుడు-శివ్ వడ్లమూడి & కో-ఫౌండర్ & జనరల్ సెక్రటరీ-కిరణ్ కుమార్ బావిశెట్టి) ఎం.ఓ.యూ కుదుర్చుకున్నందుకు మేము అభినందిస్తున్నాము. మేము మా దేశం కోసం అదే భావాన్ని అభినందిస్తున్నాము మరియు పంచుకుంటాము అని తెలిపారు.