క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

ఆదోని నియోజకవర్గం: ఆదోనిలో బహిరంగ సభను ఉద్దేశించి నియోజకవర్గ ఇన్చార్జ్ యన్. మల్లికార్జున అలియాస్ మల్లప్ప మాట్లాడుతూ రెండవ ముంబాయిగా పేరుగాంచిన ఆదోని సమస్యల నిలయంగా కనీసం త్రాగునీరు, ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం కానీ దౌర్భాగ్య పరిస్థితికి నెట్టి వేయబడింది. గత 30 సంవత్సరాల నుండి పరిపాలన చేసినటువంటి పాలకులు తమ కుటుంబీకులు అభివృద్ధి కోసం కృషి చేశారు తప్ప ఆదోని నియోజకవర్గం కృషి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. వనరులు ఉన్నప్పటికీ పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించడంలో ఇప్పటివరకు ఆదోని పరిపాలన చేసిన శాసనసభ్యులు పూర్తిగా వైఫల్యం చెందారని జనసేన పార్టీ 2024లో ప్రజలందరూ ఆశీర్వదిస్తే ఆదోని నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత ఏడాది క్రితం గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఆదోని నియోజకవర్గంలో పర్యటన చేసిన సందర్భంలో మైనార్టీ ప్రజలకు సంబంధించి ఇదిగా నిర్మాణం కోసం రెండు కోట్ల 80 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటన చేశారు మరియు గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కోట్ల రూపాయలు మంజూరు చేశారు మరియు ఆదోని రోడ్డు వైన్డింగ్ కోసం నిధులు స్థానిక శాసనసభ్యులు సాయన్న అడిగారని వాటిని కూడా కేటాయిస్తున్నామని ఆటోనగర్ కూడా ఏర్పాటు చేస్తున్నామని హామీలు మాత్రం ఇచ్చారు తప్ప పనులు మాత్రం ఎక్కడ ప్రారంభం నోచుకోలేదని అన్నారు. అరకొర సంక్షేమ పథకాలకే పరిమితమై ఆ సంక్షేమ పథకాలలో కూడా అనేక రకమైనటువంటి కోతలు విధిస్తూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి పరిపాలన చేస్తున్నటువంటి ఈ నయవంచన పాలనను చరమగీతం పాడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రశ్నించిన సమస్యలు ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు తప్పుడు కేసులు వనయించి తమ వైపు తిప్పుకునేటువంటి కుట్రలు వైసిపి ప్రభుత్వం చేస్తుందని ఇలాంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవటానికి జనసైనికులమంతా మేము సంసిద్ధంగా ఉన్నామని 2024లో కచ్చితంగా జనసేన టిడిపి ప్రభుత్వం స్థాపిస్తామని అన్నారు. ఆదోని నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అభివృద్ధి అంటే ప్రతి యేటా వలసలు, ఉపాధి లేక డిగ్రీ పట్టా చేత పట్టుకున్న యువకులు రోజు కూలీలుగా మారినటువంటి పరిస్థితి ఉంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆదోని నియోజకవర్గం ప్రజలందరూ ఆలోచించాలని కోరారు జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తే ఆదోని నియోజకవర్గం వర్గాన్ని ఏ రకమైనటువంటి అభివృద్ధి చేసి మీ యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం కల్పించాలని ప్రజలందరికీ కోరుతూ శిరస్సు వంచి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల నాయకులు క్రియాశీలక వాలంటీర్లు, వీరమహిళలు క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.