గిరిజన ప్రాంతాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వాల జోరు

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వలు గిరిజన ప్రాంతాల్లో జోరుగా జరిగాయని క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం తెలిపారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని, అందుకే మేము ముందుగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని మార్పుకు శ్రీకారం చుట్టామని గిరిజన ప్రజలు తెలిపారు. అనంతరం మత్స పుండరీకం మాట్లాడుతూ జనసేన పార్టీ కులాలమతాలకు అతీతంగా, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా, భారతజాతి సంస్కృతిని కాపాడుతూ, అవినీతి లేని సమాజం, భాషలను గౌరవించడం, ప్రాంతీయతను విస్మరించకుండా స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన అందించడమే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులు రాబోయే ఎన్నికల్లో మన గిరిజన ప్రజలకు జనసేన పార్టీ పట్ల అవగాహన కలిగిచాలి, గాజుగ్లాస్ గుర్తుకి ఓటు వేసే విధంగా మార్పు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినోద్, నవనీత్, ఢిల్లీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.