మళ్ళీ జగనే ఈ ఊహే ప్రజల్ని భయపెడుతోంది

  • జగన్ ముఖ్యమంత్రి అవ్వటం రాష్ట్ర ప్రజలు ఏనాడో చేసుకున్న పాపం
  • జగన్ ఇంకెప్పటికీ వద్దు అంటూ ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు
  • జగన్ పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు
  • మరోసారి జగన్ వస్తే చిప్పే గతి అంటూ ఖాళీ బొచ్చెలతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించిన జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ నసీర్ అహ్మద్

గుంటూరు: వైసీపీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి రాష్ట్ర ప్రజలు నరకయాతన పడుతున్నారని, మళ్ళీ జగనే అన్న ఊహే ప్రజల్ని భయపెడుతోందని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ నసీర్ అహ్మద్ అన్నారు. మరోసారి జగన్ వస్తే ప్రజలకి చిప్పే గతి అంటూ ఖాళీ బొచ్చెలతో కన్యకాపారమేశ్వరి ఆలయం నుంచి హిమని సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు జనసేన, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్ వస్తే – చిప్పే గతి హలో ఏపీ – బై బై వైసీపీ వద్దు వద్దు – ఇంకెప్పటికీ నువ్వొద్దు అంటూ పెద్దఎత్తున పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్, నసీర్ అహ్మద్ లు మాట్లాడుతూ పొరపాటున జగన్ మళ్ళీ వస్తే ఊహించని దారుణాలు జరుగుతాయన్నారు. ఇప్పటికే అన్ని వ్యవస్థలను తమ అసమర్ధతో, అవినీతితో, కునారిల్లింప చేసారని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులకు జీతాల్లేవు, యువతకు ఉపాధి లేదు, అడబిడ్డలకు రక్షణ లేదు, సామాన్యుడు బ్రతికే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దాష్టీకాలతో విదేశీ పెట్టుబడులు రావటం లేదని, స్వదేశీ వ్యాపారస్థులు ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రాన్ని అక్రమ మద్యానికి, మాదకద్రవ్యాల సరఫరాకు నిలయంగా మార్చేసారని మండిపడ్డారు. వైసీపీ నేతలు అసమర్ధతను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారన్నారు. దేశ చరిత్రలోనే జగన్ రెడ్డి లాంటి అసమర్ధ అవినీతి ముఖ్యమంత్రి మరొకరు లేరని దుయ్యబట్టారు. అసలు రాష్ట్ర ప్రజలు జగన్ కు ఎందుకు ఓటయ్యాలో వైసీపీ నేతలు గుండెలపై చెయ్ వేసుకొని చెప్పాలన్నారు. జగన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఇక అవసరం లేదన్నారు. జగన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించటానికి లక్ష కారణాలున్నాయన్నారు. జగన్ రెడ్డిని ప్రజలు ఇంకెప్పుడూ ఆదరించారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేసి చారిత్రక తప్పిదం చేశామన్న భావన రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉందన్నారు. తాము చేసిన తప్పుని సరిదిద్దుకొని టీడీపీ జనసేన కూటమికి అధికారాన్ని కట్టపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తొలుత కన్యకాపారమేశ్వరి ఆలయం వద్దనున్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.