టిటిడి అటవీ కార్మికులకు అండగా తిరుపతిలో అఖిలపక్షం

తిరుపతి, టిటిడి అటవీ కార్మికులకు అండగా తిరుపతిలో అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పిఏసి సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, జిల్లా ఉపధ్యక్షులు బత్తిన మధు బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన, తిరుపతి నాయకులు శెట్టిపల్లి చరణ్, హరీష్, ప్రసన తదితరులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… టిటిడి అటవీ కార్మికులు 586 రోజులుగా నిరాహారదిక్ష చేస్తూ కడుపు కాల్చుకుంటూ నిరసన తెలియచేస్తుంటే.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం న్యాయమా..? ఎన్నికల ముందు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లో రెగ్యులైజ్ చేస్తాననీ మాట ఇచ్చి మూడేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలను పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి వైఖరిని ఖండిస్తూ..”పేదొడికి కూడా మగబిడ్డ” అన్నట్లుగా ఫారెస్ట్ వారికి కూడా టైంస్కెలా …? పర్మినెంటా ..? అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఉందని. అటవీ కార్మికులకూ ఒక బ్రతుకు ఉందని, వారికి కుటుంబం ఉందని.. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీసెల్ ధరలు, కరెంట్, ఆర్టీసీ, బియం, పప్పు, ఉప్పు, కూరగాయల ధరలు పెరిపోయాయి. కానీ అటవీ కార్మికుల జీతాలు మాత్రం “గొర్రె తోక బెత్తెడు అన్నట్టుగా ఉంది. వీరికి ఆదాయం పెరగకుండా పెరిగిన ధరలతో ఏల జీవించాలో ఎద్దేవా చేసారు. రేపు అఖిలపక్షంతో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి వినతిపత్రం సమర్పిద్దాం అని కర్షక కార్మికులకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియచేసారు.