ఇసుక దందా అక్రమార్కులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన మైలవరం జనసేన

మైలవరం, స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమ ఇసుక దందాకు తెరలేపారని సబ్జపాడు, మైలవరంలోని అయ్యప్పనగర్ మధ్యనగల వాగులో జెసిబిలతో, ఇసుకను సమీపంలో గల మామిడితోటలో డంప్ చేసి, అక్కడ నుండి రాత్రి సమయంలో మైలవరం మరియు పరిసర ప్రాంతాలలో అక్రమంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ దందా అంతా మైలవరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన గల ఇసుక రీచ్ కి అతి సమీపంలో జరగటం దుర్మార్గపు చర్య అని, అక్రమార్కులు ఏస్థాయి నేతలయినా సరే, స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మరియు అధికారులు చొరవ తీసుకుని, అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చండ్రగూడెం గ్రామ పంచాయతీలోని 450 మందికి పైగా లబ్ధిదారులకు నేటికి కూడా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పూర్తి కాలేదని, గ్రామానికి సమీపంలో స్థలాన్ని కొని రెండు నెలలు కాలంలో లబ్ధిదారులకు అందజేస్తామన్న మీ హామీలు ఎక్కడికి పోయాయి అని చెప్పి విమర్శించారు. చండ్రగూడెంలోని ప్రాథమిక పాఠశాల మరియు స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదని, జనసేనపార్టీ ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తుందని అక్కసుతోనే, చండ్రగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది పోయి అనగతొక్కుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మైలవరం మండల ఉపాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసరావు, పడిగెల ఉదయ్, ప్రధాన కార్యదర్శి చంద్రాల మురళీకృష్ణ, రమేష్ బాబాయ్ తదితరులు పాల్గొన్నారు.