సుజనా చౌదరి తరఫున ప్రచారంలో పాల్గొన్న అళహరి సుధాకర్

  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెల్లి ధనలక్ష్మి గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్న అళహరి సుధాకర్

విజయవాడ: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నామినేషన్ కు హాజరై తిరుగు ప్రయాణంలో విజయవాడలో కావలి నియోజకవర్గ ఇంఛార్జి అళహరి సుధాకర్ ఉమ్మడి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెల్లెలు శ్రీమతి ధనలక్ష్మితో కలిసి విజయవాడలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అళహరి సుధాకర్ మాట్లాడుతూ శ్రీమతి ధనలక్ష్మి గారు హైదరాబాద్ లో ఎన్నో ఏళ్లుగా చాలా సన్నిహితులు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని బీజేపీ తరుపున సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ-జేఎస్పీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలుచున్న సంధర్భగా వారికి సంఘీభావంగా వారిని గెలిపించుకోవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రచారంలో పాల్గొనడం జరిగిందని సుజనా చౌదరి గారు ఇక్కడి నిలబడటమే మీ అదృష్టం అని వారిని గెలిపించు కుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని తప్పక కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించ వలసినదిగా అక్కడి ప్రజలను కోరడము జరిగింది అన్నారు.