యాదమరి మండలంలో రోడ్ల అద్వాన్న పరిస్థితిపై జనసేన ఆధ్వర్యంలో అఖిలపక్షం నిరసన గళం

పూతలపట్టు: యాదమరి మండలంలోని జోడి చింతల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ఉన్న రోడ్ల దయనీయ పరిస్థితిపై జనసేన పార్టీ యాదమరి మండల అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమార్ మాట్లాడుతూ.. యాదమరి మండలంలోని అంతర్రాష్ట్ర రహదారి గత నాలుగు సంవత్సరాలుగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా గుంతలమయమయి ప్రజలను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, జనసేన పార్టీ వివిధ మాద్యమాల ద్వారా అనేకసార్లు నిరసనలు ప్రదర్శించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని, ఇదే మార్గంలో స్థానిక ప్రజాప్రతినిధులు పలుమార్లు ప్రయాణం చేసి నప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయినారని కాబట్టి, వారందరూ తమ తమ పదవులకు రాజీనామా చేసి తమతో పాటు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని, ఇందులో అన్ని వర్గాల ప్రజలను ప్రజాసంఘాలను భాగస్వామ్యులను చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని, ఈ సమస్య పరిష్కారమయ్యేంతవరకు జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి గంగరాజు, జనసేన పార్టీ యాదమరి మండల ప్రధాన కార్యదర్శులువేముల పవన్, బి రవి కుమార్, కార్యదర్శులు రమేష్, చంద్ర, పవన్, సంయుక్త కార్యదర్శి పాండియన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాన్న బాల లోకేష్ రాయల్, వెంకటేష్, జన సైనికులు ఎం వెంకటేష్, ప్రభాకర్, బాలకృష్ణ, మాధవ తదితరులు పాల్గొన్నారు.