నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు నిత్యావసరాలను అందించిన అనంతపురం జనసేన

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జనసేన పార్టీ నిరుపేద కార్యకర్తల కుటుంబాలకు 25 కేజిల బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవలే ప్రమాదవశాత్తు మృతి చెందిన అనంతపురం నగరంలోని బీజేపీ కాలనికి చెందిన జనసేన కార్యకర్త గుండె సంజీవరాయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి 25 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు పెండ్యాల శ్రీలత అందించి గుండె సంజీవరాయుడు పిల్లల విద్యాభివృద్ధికి పెండ్యాల హరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, సంయుక్త కార్యదర్శి దేవరకొండ జయమ్మ, నాయకులు పెండ్యాల చక్రధర్, రోడ్ల భాస్కర్, తోట ప్రకాష్, టీ.ఎన్.అంజి, ఎం.వి శ్రీనివాస్, ఆకుల ప్రసాద్, ముని, సుమన్, వంశీ, చిరు తదితరులు పాల్గొనడం జరిగింది.