తిరుమలకు పాదయాత్ర చేపట్టిన జనసైనికులకు స్వాగతం పలికిన నందలూరు జనసేన

బద్వేల్: ఉమ్మడి కడప జిల్లా, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2024 లో ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ జనసైనికులు టి.వెంకటేష్, కోటపాటి.నరసింహా, చెన్నంశెట్టి. లక్ష్మినారయణలు బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టి… పాదయాత్రలో భాగంగా రెండవ రోజు నందలూరుకు విచ్చేయడంజరిగింది. వారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం‌ ఉన్న కొట్టే.నరసింహులు, రాముడు, మస్తాన్ రాయల్, యెద్దల.నరసింహా, వేణు రాయల్ తదితర జనసేన నాయకులు ఘన స్వాగతం పలికీ వారికి మద్దతుగా సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొట్టే.నరసింహాలు మాట్లడుతూ గ్రామ, గ్రామన జనసేనను బలపరుస్తూ పోరుమామిళ్ల జనసైనికులు చేపట్టిన జగన్ పోవాలి-పవన్ రావాలి సంకల్ప తిరుమల పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా జరగాలని వారికి నందలూరులో స్వాగతం పలకడం జరిగింది.