జనసైనికులకు అండగా ఉంటానని జనసేనాని భరోసా

పెడన: ఇటీవల మన పెడన నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలపై జరుగుతున్నదాడులు అందరికీ విధితమే దీని గురించి నిన్న అనగా తేది (27-11-2022) ఆదివారం మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పెడన నియోజకవర్గం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మరియు మొన్న దాడికి గురయ్యి అక్రమ కేసులను ఎదుర్కొంటున్న జనసైనికులను వారి కుటుంబ సభ్యులతో సహా పవన్ కళ్యాణ్ కలవటం జరిగింది. వారి కుటుంబ సభ్యులు అందరికీ అన్నీ విధాలా అండగా ఉంటామని పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న మడ అడవులు నరికి చెరువులను తవ్వడం, వైద్య సదుపాయాలు లేమితో ఎస్టీ మహిళకు సరైన వైద్యం అందించక నవ జాతి శిశువును కోల్పోయిన ఘటన, అక్రమ మట్టి తవ్వకాలు, గుంతలతో ఉన్న రోడ్ల సమస్య, నియోజక వర్గంలో ఉన్న తాగు నీరు – సాగు నీరు సమస్య, చేనేత కార్మికుల సమస్య, నియోజకవర్గంలో ని మౌలిక వసతుల లేమి మొదలగు సమస్యలను ఈ సమావేశంలో పెడన జనసేన నాయకులు రామ్ సుధీర్ పవన్ కళ్యాణ్ కి తెలియచేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ త్వరలోనే అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చూపే దిశగా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు వెళతం అని రామ్ సుధీర్కి చెప్పడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మరింత బలంగా పోరాడాలని పార్టీ తరపున ప్రజలకు అండగా నిలవాలని జనసేన నాయకులకు, జనసైనికులకు పవన్ కళ్యాణ్ సూచించారు. జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా అధికారులు ఎవరైనా జనసైనికులను ఇబ్బందిపెట్టినా ఎవ్వరికీ బయపడొద్దని పరిస్థితులు మరీ మితిమీరితే స్వయంగా తానే పెడన వస్తానని అవసరం అయితే కొన్ని రోజులు పెడనలోనే ఉంటానని పవన్ కళ్యాణ్ తెలియచేశారు. పవన్ కళ్యాణ్ మాటలు, ఆయన ఇచ్చిన భరోసా జనసైనికులకు వారి కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని నింపాయి. జనసైనికులలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపాయి తమకు అండగా ఉంటామన్న పవన్ కళ్యాణ్ కి జనసైనికుల కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *