ఆంధ్రప్రదేశ్ లోనే పెట్రోలు, డీజల్ ధరలు ఎక్కువ

మదనపల్లె, పెట్రోల్ డీజిల్ పై భారీగా పన్నుల బాదుడు, ధరల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తొమ్మిది నెలల్లోనే రాష్ట్ర ఖజానాకు 11 వేల కోట్లు. 2019 మే నెలలో జగన్ సీఎం అయ్యే నాటికి తాడేపల్లి లో లీటర్ పెట్రోల్ ధర 76.89 ఇప్పుడు 120.95 అయిపోయింది. అంటే 57% పెరిగింది. అప్పట్లో 71.50 వున్న డీజిల్ ధర ప్రస్తుతం 106.58 అయింది అంటే 49.6 శాతం పెరిగింది. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పెట్రోలు డీజిల్ రేట్లపై ప్రభుత్వంపై విరుచుకు పడి అధికారం చేపట్టాక వాటి ధరలు తగ్గించేందుకు తీసుకున్న చర్యలు లేవు సరికదా మరింత భారం వేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికీ పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ 2 రూపాయలు మాత్రమే ఉండగా దాన్ని 4 రూపాయలు చేశారు. రహదారి అభివృద్ధి పేరుతో లీటరుకు రూపాయి మరింత వడ్డించారు. పెట్రోల్ డీలర్ కమిషన్ 3.80 రాష్ట్ర పన్ను 31.30 కేంద్ర ఎక్సైజ్ పన్ను 27.90 మూల ధర రవాణా 57.95 మొత్తం 125.95 కేంద్ర ఎక్సైజ్ పన్ను కన్నా పెట్రోలుపై రాష్ట్రం పన్ను అధికంగా ఉంది.

అలాగే డీజల్ పై
డీలర్ కమిషన్ …….22.50
రాష్ట్రం పన్ను………….22.20
కేంద్ర ఎక్సైజ్ పన్ను …21 88
మూలన, రవాణా……. 60.10
మొత్తం ధర ……….106.60
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగదారుల పై కనికరం చూపలేదు పైగా కేంద్ర చర్యలతో రాష్ట్ర ఆదాయం పడిపోతుందని ముఖ్యమంత్రి కేంద్రంపై విమర్శలకు దిగుతున్నారని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.