అంగన్వాడీవర్కర్ల డిమాండ్లను వెంటనే అమలు చేయాలి: సాకే మురళీకృష్ణ

శింగనమల నియోజకవర్గం: బుక్కరాయసముద్రం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో వారి ప్రాదాన డిమాండ్ల అమలుకోసం నిరవరధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. వీరికి శింగనమల జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ సాకే మురళీకృష్ణ పాల్గొని దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని, మహిళలని చూడకుండా వారి న్యాయ బద్దమైన డిమాండ్లను అమలు చేయకుండా అంగన్వాడీ వర్కర్లను రోడ్డుమీదకి లాగారు శాంతియుతంగా సమ్మె చేస్తున్న వర్కర్లను పిలిపించి, చర్చలు చేసి సమస్య పరిష్కారం చెయ్యకుండా వలంటీర్లను సెంటర్లను బీగాలు పగలగొట్టు రౌడీఇజం చేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది ఈ జగన్రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా కారోనా వంటి విపత్కర పరిస్థితులలో తమ ప్రాణాలను పణంగా పెట్టి అంగన్వాడీ వర్కర్లు ప్రజారోగ్యం కోసం కృషి చేశారని, ప్రభుత్వం వారి న్యాయ బద్దమైన డిమాండ్లు అయిన కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు ఇవ్వాలని అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మొదలగు ముఖ్యమైన 10రకాల డిమాండ్లను వైకాపా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ తరపున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అలాగే తన పాదయాత్రలో పక్క రాష్ట్రంలో కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పి ఈ రోజు మాట తప్పి మడమ తిప్పడని చెప్పారు. వారి న్యాయమైన డిమాండ్స్ ను మానవతతో తీర్చలని లేదంటే త్వరలోనే జనసెన టీడీపీ అధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అప్పుడు వారి న్యాయమైన డిమాండ్స్ తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, మండల కన్వీనర్ ఎర్రిస్వామి, మండల ప్రధాన కార్యదర్శి అరటి తాహిర్ మండల నాయకులు విశ్వనాధ్ రమేష్ బాషా తదితరులు పాల్గొన్నారు.