ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఏపీ శివయ్య, మోతుకురి సోమశేఖర్ ప్రచారం

పూతలపట్టు నియోజకవర్గం: ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య, మోతుకురి సోమశేఖర్ నాయుడు. పూతలపట్టు నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కలికిరి మురళీమోహన్ గెలుపునకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఐరాల మండలం కార్యనిర్వాహక కార్యదర్శి మోతుకురి సోమశేఖర్ నాయుడు. ఆయన ఓటర్లకు సూపర్ సిక్స్ పథకాలు గురించి ఓటర్లకు తెలియపరిచారు. జాబు రావాలంటే బాబు రావాలి. బాబు రావాలంటే సైకో పోవాలి. ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి రెండు ఓట్లు వేయాలి ఒకటి పూతలపట్టు నియోజకవర్గం కలికిరి మురళి మోహన్ కి సైకిల్ పై బటన్ నొక్కాలి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గు మల్ల ప్రసాద్ రావుకి సైకిల్ గుర్తుపై బటన్ నొక్కాలి. రెండు ఓట్లు సైకిల్ కి వేసి అఖండ విజయంతో గెలిపించి మురళీమోహన్ ని అసెంబ్లీకి, దగ్గుమల్ల ప్రసాద్ రావు ని పార్లమెంట్ కి పంపించాలని అప్ సివైష్ ఓటర్లకు తెలియజేశారు. వేదగిరి వారి పల్లి పంచాయతీ గ్రామాల్లోని ప్రజలకు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే వాటి ప్రయోజనాలు గురించి ఓటర్లకు వివరించారు. ఇంట్లో చదువుకునే విద్యార్థి ఉంటే 15 వేల రూపాయలు ఇస్తారని, మహిళలు బస్సు ప్రయాణం ఉచితమని, ఒక్క సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితమని, 50 సంవత్సరాలు నిండిన వారికి నాలుగు వేల రూపాయలు ప్రతినెలా పెన్షన్ ఇస్తారని, ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లయితే ప్రతి విద్యార్థికి 15000 చొప్పున ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, జనసేన నాయకులు పురుషోత్తం, వాసు రాయల్, రుషి నాయుడు, గంగి నాయుడు, బాలకృష్ణ, హరిప్రసాద్, శివ రాయల్, నాంపల్లి సర్పంచ్ స్వర్ణ ప్రశాంత్, బాలాజీ, అరుణ్, చంద్రమణి, జయచంద్ర, దామోదరం చంగల్ రాయి నాయుడు పంచాయతీలోని ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.