గుండిమెడ గ్రామ జనసేన పార్టీ కమిటీ నియామకం

మంగళగిరి: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నూతనంగా నియమితులైన తాడేపల్లి మండలం, గుండిమెడ గ్రామ కమిటీ సభ్యులకు నియమక పత్రాలు మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. గుండిమెడ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులుగా జెట్టి రమేష్ బాబును నియమించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా మేకల కృష్ణ, ప్రధాన కార్యదర్శులు: కనపర్తి రవిబాబు, బుజ్జా శంకర్, షేక్ నాగుల్ మీరా, నామతోటి వంశీ, కార్యదర్శులుగా నామతోటి నరేష్, దాసరి ఏసుదాసు, సంయుక్త కార్యదర్శులుగా పల్లె శంకర్ బాబు, ఆరుమళ్ళ కార్తీక్, మేడికొండ ఆనంద్, మొరుగుమాల గణేష్, బద్దెపూడి శంకర్,గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్స్: కొచ్చర్ల నాగమల్లేశ్వరరావు, ఆరుమళ్ళ వంశీ లకు నియామక పత్రాలను అందించడం జరిగింది. అనంతరం మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ముందుగా నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లి మండలం గుండిమెడ సీఎం దగ్గరగా ఉండే గ్రామం నుండి వైసిపి కార్యకర్తలు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీలో చేరుతూ గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేశారని తెలియజేశారు. రానున్న రోజుల్లో కుల మతాలకు అతీతంగా జనసేన పార్టీ బలపడుతుంది అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఒక్క ఛాన్స్ అని జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక మాఫియా, గంజాయి సరఫరా, కల్తీ మద్యం ఇలా అనేక విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడం. పోలీస్ సిబ్బందిని వైసీపీ పార్టీ కార్యకర్తల్లాగా పని చేయించుకుంటూ ప్రశ్నించిన వారి మీద అక్రమ కేసులు పెట్టించడం. కార్మికులకు సరైన ఉపాధి కూడా కల్పించలేక పోయారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉన్నా సరే ఉమ్మడిగా కలిసి గెలుపు దిశగా పనిచేస్తామని అన్నారు. గుండిమెడ గ్రామంలో ఉమ్మడిగా అందరూ కలిసి గ్రామ సమస్యలపై గ్రామ అభివృద్ధి పై కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, గుంటూరు జిల్లా కార్యదర్శి రావి రమా, ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, ఎంటిఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంటిఎంసీ కార్యదర్శి తిరుమలశెట్టి మురళీకృష్ణ, తాడేపల్లి పట్టణ యువజన అధ్యక్షులు సింగంశెట్టి వెంకట్, తాడేపల్లి మండల కార్యదర్శి గంజి రమేష్, గుండిమెడ గ్రామ సీనియర్ నాయకులు పెద్దనేని వేణు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.