పోలవరం మండల పరిధిలోని పాతపట్టిసీమ గ్రామంలో గ్రామకమిటి నియామకం

పోలవరం నియోజకవర్గంలో జిల్లా అద్యక్షులు కొటికలపూడి గోవిందరావు మరియు పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు ఆదేశాల మేరకు మంగళవారం పోలవరం మండల పరిధిలోని పాతపట్టిసీమ గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీని మండల అద్యక్షులు గుణపర్తి వీర వెంకట సత్యనారాయణ(చిన్ని) అద్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ పాతపట్టిసీమ గ్రామ అధ్యక్షునిగా కరిబండి గని రాజు ని ఉపాధ్యక్షులుగా పందిటి రామ దుర్గ ప్రసాద్ ని మరియు గ్రామ కమిటీని అలాగే కొయ్యలగుడెం మండలం తోట రవి అద్యక్షతన యర్రంపేట గ్రామ అధ్యక్షునిగా నారా కేశవరావు ఉపాద్యక్షుడిగా ఇంటి వీరబద్రం ప్రధాన కార్యదర్శిగా కుసిం రామకృష్ణ తదితరులను ఎంపిక చేసారు.