నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం – శ్రీమతి వినుత కోటా

విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని విశాఖ నోవా టెల్ హోటల్ దగ్గర అడ్డుకుని పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. స్థానిక ఎంపీ భవనానికి వాస్తు కోసం ప్రజలు నడిచే రోడ్డును ఎలా మూసివేస్తారు అని ప్రశ్నించడానికి వెళ్తే అడ్డుకోవడం పిరికి పంద చర్య అని తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో నిరసనలు తెలిపే అవకాశం లేదా!! ఆంధ్రలో రాజా రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా లేక భారత రాజ్యాంగం నడుస్తుందా అని మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ ని, జనసేన నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరను తప్పు బట్టారు. మునుముందు ప్రజా సమస్యలపై మరింత బలంగా పోరాటాలను ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.