జనసైనికులను అరెస్ట్ చేయడం దారుణం

ఎరువులను తక్షణమే అందించి ఆదుకోవాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసైనికులను అరెస్ట్ చేయడం దారుణమని జనసేన కరప మండల అధ్యక్షుడు బండారు మురళి, సీనియర్ నాయకుడు భోగిరెడ్డి కొండబాబులు తీవ్రంగా ఖండించారు. జనసేన పార్టీ కాకినాడ రూరల్ పీఏసీ సభ్యుడు పంతం నానాజీ ఆదేశాల మేరకు బుధవారం కరప తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులకు మద్దతుగా నిరనస తెలిపారు. ఈ నిరసనల్లో జనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని కరప పోలీసషన్ కు తరలించారు. అంతకు ముందు జనసైనికులు తహసీల్దార్ ని కలిసి రైతులకు తక్షణమే కరప మండల రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఎంఆర్వోకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి గంగాధర్, నున్న గణేష్ నాయుడు, మండల కార్యవర్గ సభ్యులు, గ్రామ అధ్యక్షుడు, గ్రామ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.