జంగారెడ్డిగూడెం కల్తీ సారా ఘటన భాదిత కుటుంబాలకు సహాయం ప్రకటించాలి

జంగారెడ్డిగూడెంలో నాటు సారా తాగి అకాల మరణం పొందిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం ప్రకటించాలని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు డిమాండ్ చేశారు… ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటనపై తెలుగు దేశం రాజకీయం చేస్తే, వైసీపీ ప్రభుత్వం తెలుగుదేశం పై పెగాసస్ విషయం పైన రాజకీయాలు చేస్తున్నారన్నారని తెలిపారు.. పాలన వదిలేసి రాజకీయాలు మాత్రం చేస్తున్న అధికార, ప్రతిపక్షాలు నిజమైన చిత్తశుద్ధతో.. ప్రజల కోసం పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సంధించిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవ్వాలన్నారు.. రాష్ట్రంలో దేవాలయాలపై, మహిళలపై, దళితులపై జరిగిన దాడులకు ప్రభుత్వం నుండి సమాధానం లేదన్నారు.. ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్షం అధికారం లేదని అసెంబ్లీ పైన అలిగి వెళ్లిపోవడం చేతకానితనం అన్నారు. ఇలాంటి నాయకులను ఎన్నుకొని ప్రజలు నిజంగా మోసపోయారు అన్నారు.. వైసీపీ ప్రభుత్వానికి అప్పులు చేయడం తప్ప అభివృద్ధి తెలియదన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి బటన్ నొక్కుతున్నారే గానీ.. లబ్ధిదారులకు సరైన సమయంలో ఫలాలు అందడం లేదన్నారు. ప్రజలు ఓట్లు వేస్తే ప్రజల కొరకు పని చేయడం లేదన్నారు.. ప్రస్తుతం అధికార ప్రతిపక్షాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు. జంగారెడ్డిగూడెం నాటుసారా మృతులంతా నిరుపేద కుటుంబాలయిన కారణంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి తక్షణ సహాయం ప్రకటించాలని కోరారు.