తలస్సేమియా & సికిల్ సెల్ సొసైటీ వార్షికోత్సవానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు

*తలస్సేమియా & సికిల్ సెల్ సొసైటీ ఖమ్మం 1వ వార్షికోత్సవానికి జనసేన నాయకులను ఆహ్వానించినందుకు జనసేన పార్టీ తరపున, జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ తరఫున సొసైటీ వారికి మరియు టీం కి పేరుపేరునా ధన్యవాదాలు

గత సంవత్సరం 2021 సెప్టెంబర్ 2వ తారీకున తలస్సేమియా & సికిల్ సెల్ సొసైటీ ఆర్గనైజేషన్ కి జనసేన పార్టీ తరఫున బ్లడ్ బ్యాంక్ లో భాగంగా 100 యూనిట్ల బ్లడ్ ను అందించడం జరిగింది. ఈ సంవత్సరం వారు జనసేన పార్టీ చేసిన సేవలను గుర్తించి 1వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులను, ఖమ్మం నగర కమిటీ ను మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ నాయకులను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శి మేడపోయిన కార్తీక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ ఉపాధ్యక్షులు యాసంనేని అజయ్ కృష్ణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన విభాగం కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మైలవరపు మణికంఠ, ఎగ్జిట్ నెంబర్ గుంత సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.