గిరిజనులపై దాడులను తక్షణమే ఆపాలి: జాగారపు పవన్ కుమార్

పాడేరు నియోజకవర్గం: గిరిజనులపై జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ పాడేరులో గురువారం జరిగిన రాష్ట్రబంద్ లో పాల్గొన్న పెదబయలు మండలం, జనసేన పార్టీ యువ నాయకుడు జాగారపు పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులపై మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ మహిళల్ని అర్థ నగ్నంగా ఊరేగించడం అన్నది యావత్ భారత దేశానీకే తలదించుకునే పరిస్థితి వచ్చింది. గిరిజనులపై జరుగుతున్న దారుణాలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఎవరైతే గిరిజనులపై దాడిచేసిన వక్తులపై కటినంగా శిక్షించి ఉరి తీయాలని ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింసాకాండలను మన రాష్ట్రంలో జరగకుండా చూడాలని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బిజెపి మరియు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.