వడ్డేపుట్టు గ్రామంలో పర్యటించిన జనసేన నాయకులు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పెదబయలు మండలం అడుగులు పుట్టు పంచాయితీ వడ్డేపుట్టు గ్రామంలో పర్యటించిన మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ ను స్థానిక గ్రామ జనసైనికులు కె.రఘు, రెడ్డి బాలన్న, శివన్న, పలువురు వీరమహిళలు ఘనస్వాగతం పలికి గ్రామ సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశంలో గ్రామంలోగల త్రాగు నీటి సమస్యవల్ల ఊట గెడ్డ నీరు తాగుతున్నామని, అలాగే డ్రైనేజీ వ్యవస్థ లేదని గ్రామంలో ఇందువలన విషజ్వరాలు ప్రబలడం సహజమై పోయిందని, గ్రామస్తులు వాపోయారు. మండల అధ్యక్షులు పవన్ కుమార్ మాట్లాడుతూ తప్పకుండా ఈ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని, అలాగే ప్రస్తుత ప్రభుత్వ తీరు కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరారు. గ్రామస్తులందరు ఐటీడీఏ వేదికగా జరగబోయే స్పందన కార్యక్రమంలో మన గ్రామ సమస్యలను వినతి పత్రం రూపంలో సమర్పిద్దామని, అందుకు అందరు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అలాగే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని, మార్పు కొరకు రాజకీయ ప్రక్షాళన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ ని మనమందరు ఆదరించాలని కోరారు. జనసేనపార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు లక్ష్యాలు సుదీర్ఘ 25 ఏళ్ల భవిష్యత్ కాంక్షించే పార్టీ అని, బ్జావితరాల భవిష్యత్ నిర్మాణం కేవలం జనసేనపార్టీ తోనే సాధ్యమని వడ్డేపుట్టు గ్రామప్రజాలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్, కె. రఘు, రెడ్డి బాలన్న, నారాయణ, శివన్నా, వీరమహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.