క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలకు బహుమతి ప్రదానం

తణుకు నియోజకవర్గం: అత్తిలి మండలం, అత్తిలి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ 2023 యంగ్ పవర్ స్టార్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్న ఫైనల్ క్రికెట్ మ్యాచ్ కు ముఖ్యఅతిథిలుగా జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ లో మొదటి స్థానంలో విజయం సాధించిన వీరవాసరం టీంకు 50వేల నగదు మరియు 2వ స్థానంలో విజయం సాధించిన తణుకు టీముకు 20,000 3వ స్థానంలో విజయం సాధించిన కుంచనపల్లి టీంకు 10,000 నగదు మరియు ప్రైజస్ ప్రదానం కార్యక్రమం ముఖ్యఅతిథిలుగా విచ్చేసిన తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు, అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు దాసం ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ దిరిశాల వెంకట్, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ చేతులమీదుగా జరిగినది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.