కోట్లాది హిందువుల ఆకాంక్ష – అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట

  • గుంటూరు తూర్పు జనసేన సమన్వయకర్త మరియు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్

గుంటూరు: గుంటూరు 12వ డివిజన్ చౌత్ర డౌన్ గంజి బజార్ నందు గంజి జాజర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అయోధ్య రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా గంజి బజార్ ఫ్రెండ్ సర్కిల్ వారు ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు సమన్వయకర్త మరియు నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొనీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ ఏళ్ల నాటి కల.. కోట్లాది హిందువుల ఆకాంక్ష.. శ్రీరామ జన్మభూమి అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట నిరీక్షణ ఫలించే శుభదినం అన్ని ఈ అద్భుత ఘట్టానికి సమయం ఆసన్నమైంది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు దేశ ప్రజల పైన ఉండాలని ఆ జానకీ వల్లభూడుని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ అధ్యక్షుడు కొణిదె దుర్గాప్రసాద్, సెక్రెటరీ శివసుందర్ కుమార్, జాయింట్ సెక్రెటరీ అంజన్ కుమార్, సోము ఉదయ్, 13వ డివిజన్ అధ్యక్షుడు పసుపులేటి నరేష్, వక్కలగడ్డ నాగేశ్వరరావు వక్కలగడ్డ హరి ప్రసాద్, మోపిదేవి నాగరాజు, ప్రసాద్, గుంటూరు శివాజీ, గుంటూరు నాగేశ్వరరావు, సుబ్బు, హరీష్, రాజారావు, రవి, పలువురు పాల్గొన్నారు.