ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పనులు జరగాలని హితవు పలికిన బాబు పాలూరు

బొబ్బిలి మున్సిపాలిటీ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుర్ర, బుద్ధి ఉన్నవారెవ్వరూ, మున్సిపాలిటీ, మెయిన్ రోడ్డు పనులను పట్టణ ప్రజలు, ప్రయాణికులు రద్దీగా తిరిగే పట్టపగలు చేపట్టరు. పట్టణంలో రోడ్డు పనులు ప్రయాణికుల రద్దీ లేని రాత్రిపూట లేదా తెల్లవారుజామున చేస్తారు. విరుద్ధంగా మీ పిచ్చ ప్రచారం కోసం ప్రజలను, చిన్నారి విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఇలా పట్టపగలు చేపట్టరు. ఈ రోడ్డు పని మాత్రమే కాదు, డ్రైనేజీ మరమ్మత్తులు కోసం గుంతలు కూడా పట్టపగలే తవ్వేసి ప్రజలను టార్చర్ పెడుతున్నారు. ఇప్పుడు రోడ్లు మరమ్మత్తులు పేరుతో జనాల నోట్లో మట్టి కొడుతున్నారు పట్టపగలే. శృతి మించిపోతున్నారు కాబట్టి, ఈరోజు స్పందించాల్సి వచ్చింది. అన్యధా భావించకుండా, కొంచెం విజ్ఞతతో ఆలోచించి..మీ టైమింగ్స్ మార్చుకుంటే మంచిది. కమిషనర్ మరియు ఆర్ అండ్ బి అధికారులు వైసిపి నాయకులలాగా లేక కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగులులాగా కాకుండా, కొంచెం ప్రజలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తే మంచిదని మా జనసేన పార్టీ తరపున హితవు పలుకుతున్నామని తెలిపారు.