ప్రభుత్వంలో పదవులు ఇవ్వడం తప్ప మత్స్యకారులకు ఎక్కడా న్యాయం జరగలేదు

నరసాపురం, విశాఖ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన కుటుంబాలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 50000 రూపాయలు అందించి వారికి జనసేన పార్టీ తరపున భరోసా అందించారు. దీనిని వ్యతిరేకిస్తూ నరసాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు మత్స్యకార సామాజిక ముసుగులో ప్రెస్ మీట్ నిర్వహించి జనసేన పార్టీ మత్స్యకార నాయకుల మీద మరియు పార్టీ శ్రేణులు మీద విమర్శలు చేశారు. ఈ విమర్శలను ఖండిస్తూ నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ మత్స్యకార నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ సభ్యురాలు తిరుమాని సీతామహాలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి వాతాడి కనకరాజు, నియోజకవర్గ నాయకులు మైలా వసంతరావులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో మత్స్యకారులకు ఒరిగింది ఏమి లేదు అని అన్నారు. అలాగే విశాఖ హార్బర్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 80 శాతం ఎక్స్ గ్రేషియా ప్రభుత్వ మరియు మత్స్యకార సంక్షేమాల ఖజానాలలోంచి తీసి ఇచ్చినవే తప్ప జగన్ తన సొంత డబ్బు ఇవ్వలేదు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం బోటుకు 50000 రూపాయల చొప్పున ఇచ్చారని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో పదవులు ఇవ్వడం తప్ప మత్స్యకారులకు ఎక్కడా న్యాయం జరగలేదు అని అన్నారు. పదవులు తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు అని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వంలో దోచుకుని దాచుకోవడం తప్ప మత్స్యకారులకు ఎక్కడా వారి సమస్యలు తీర్చలేదు అని తెలియజేశారు. ప్రభుత్వంలో పదవులు తీసుకున్న నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి హడావిడి చెయ్యడం తప్ప తమ సామాజికవర్గానికి రావలసిన నిధులు మరియు కావాల్సిన న్యాయం గురించి మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి ఎసురత్నం, తిరుమని బాలకృష్ణ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.